కుదిలించు

 

మే 14, 2025

కుదిలించు (kudilinchu)

   అర్థము

    (క్రియ) : బాగా కదిలించు; విదిలించు

  Meaning

   (verb) : to shake violently; jolt

    వాడుక / Usage

    గుండె కుదిలించి నీ ముందు కుప్పవోతు అందుకోవయ్య హృదయ పుష్పాంజలులను.
    I will stir my heart and empty at your feet; accept flower bedecked salutations from the depths of my heart.

  మెదడుకు మేత / Food for thought

    బృందారకానంద మందార మకరంద
    బిందునిష్యందాల విందు పెండ్లి :
    రంగారు ముంగారు సరసాంత
    రంగాల సత్యనర్తనము పెండ్లి :
    సోగాకన్నులరాణి రాగరంజితపాణి
    రాణించు మాణిక్యవీణ పెండ్లి :
    చిన్నారి పొన్నారి చిగురు చెక్కిళ్ళలో
    నవ్వులొల్కు గులాబిపువ్వు పెండ్లి:
    ప్రేమతో దేవతలు పెట్టు బిక్ష పెండ్లి :
    అక్షయంబైన శ్రీరమరాక్ష పెండ్లి :
    వధువు వరుడును “ద్వంద్వ” మై మధువు గ్రోలు
    ప్రేమ బృందావనారామసీమ పెండ్లి

    -- కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ