పాద్యము
మే 15, 2025
పాద్యము (pādyamu)
అర్థము
(విశేషణము) : పాదములు కడుగుకొనుటకు నీరు
Meaning
(adj) : water for washing the feet
వాడుక / Usage
పాద్యమ్ము నిడ మాకు పన్నీరు లేదు నా కన్నీళ్ళతో కాళ్ళు కడుగనుంటి.
To clean your feet I have no scented water; but I will wash them with my tears (of joy).
మెదడుకు మేత / Food for thought
ఆడుకున్నారిచట ఆమ్నాయ బాలికలుయుగవీధులందు నాలుగు స్తంభములయాట
పాడుకున్నారిచట బ్రహ్మర్షి సత్తములు
గంగాతరంగిణీ గతులలో శృతి గలిపి .
కాళిదాస కవీంద్రు కవితాకుమారి నా
శిఖరామ్చాలములందు స్వేచ్చగా తిరిగినది
కంది కుందెడి యక్షసుమ్దరికి చల్లగా
అందించినది "మేఘసందేశ "మిచ్చోట .
ఇది నా తపోభూమి ఇది నా మహాభూమి
బదరీ మహాక్షేత్ర పరమపావన భూమి
సత్యధర్మముల కాశాజ్యోతి యగుభూమి
శౌర్య ధైర్యముల స్వేచ్చాగీతి యగు భూమి.
భావిభారత నిరభ్యంతరానంద సం
భావనాహ్లాద భర పారవశ్యుడ నేను
ఆరద్ర మానస పులకితాంత రానందాశ్రు
వాహినీ భరిత హిమవద్గిరీంద్రుడ నేను.
భావనాహ్లాద భర పారవశ్యుడ నేను
ఆరద్ర మానస పులకితాంత రానందాశ్రు
వాహినీ భరిత హిమవద్గిరీంద్రుడ నేను.
-- కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి
Comments
Post a Comment