నీరజాతనయన

 

ఏప్రిల్ 27, 2023

నీరజాతనయన    (neerajaata-nayana)

    అర్థము

   (విశేష్యము): నీరజాత=నీటిలో పుట్టినది, పద్మము; నయన=కళ్ళు; పద్మమువంటి కనులు కలవాడు

   Meaning

   (noun) : lotus eyed

   వాడుక / Usage

"నీరజాతనయన! నీకు దాస్యంబుజేయని జన్మ మేల? యెన్ని జన్మములకు?"
O Lotus eyed one! What use is this birth(s) that doesn't worship you?

   మెదడుకు మేత / Food for thought

చాలామంది రచయితలు తమ భావాలని ప్రకటించడానికి భాషను తమదైన శైలిలో ఉపయోగించారు. దేవులపల్లి శబ్ద సౌందర్యాని కన్నా భావలాలిత్యానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు. సినారె భావ ప్రకటనలో గాంభీర్యత తొణికిసలాడుతుంది. శ్రీశ్రీ పదాలలో ఆవేశం  పెల్లుబుకుతుంది. ఆత్రేయ తక్కువ పదాలతో ఉన్నత భావాలు పలికిస్తారు.  సముద్రాల (సీ), పింగళి నాగేంద్ర రావు తరువాత కవు లెవరూ, వేటూరి వచ్చేదాకా, భాషా సౌందర్యాన్ని ఇనుమడింప చేస్తూ, భాషతో సందర్భానికి ఔన్నత్యం కలిగించే ప్రయత్నం చేయలేదు.  ముఖ్యంగా భాషను మలచి (అవసరమైతే పదాలను మార్చి లేక సృష్టించి) సందర్భానికి అతికేటట్టు వ్రాయడం లో వేటూరి బాణీ కొంత పింగళి బాణీ ని పోలి యుంటుంది.  పింగళి శైలికి అనుబంధంగా, విశేషణాలను నామవాచకం గా మారుస్తూ  వేటూరి ఒక కొత్త, ఆహ్లాద పరిచే   పధ్ధతి ప్రవేశపెట్టారు. ఈ పధ్ధతి ఇప్పటికీ వాడుకలో ఉంది.
-- వెలుగు నీడలు – వేటూరి, శ్రీనివాస్ కంచిభొట్ల

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి