Posts

Showing posts from October, 2026

దెస

  అక్టోబర్ 30, 2026 దెస ( desa )     అర్థము      (విశేష్యము) : దిశ; దిక్కు; అవస్థ; రక్షణ    Meaning     (noun ) :  a side/quarter/direction; hapless condition; protection      వాడుక / Usage       హ రి చరణములకుఁ బ్రియవై    హ రి నిను మన్నింప భద్ర మం దెడు తులసీ!    హ రి నీ దెస రాఁడు గదా    హ రి చొప్పెఱిఁగించి శుభము లం దింపఁగదే    You are dear to the lotus feet of Hari    Tulasi you are blessed with the grace of Hari     To your fragrant abode has he come Sri Hari    May you be auspicious to us and show the path to Hari    మెదడుకు మేత / Food for thought        సంగీతం ప్రేమకు అమృతం లాంటిది అయితే, ఆ సంగీతాన్ని ఇలాగే అలరించనివ్వండి. ఆ సంగీత ఝరిని మరింతగా మరింతగా పారనివ్వండి. ఎంతగా అంటే మితిమీరిన ఆ రసాస్వాదానికి విసిగి నాలోని ప్రేమ వ్యామోహం కడతేరేంత వరకు.       -- ట్వెల్త్ నైట్, వ...

రుచిరము

  అక్టోబర్ 29, 2026 రుచిరము ( ruchiramu )     అర్థము      (విశేషణము) : అందమైనది; కాంతివంతమైనది; మంచి రుచి, సువాసన కలిగినది; తగినది    Meaning     (adj ) :  beautiful; radiant; tasty; apt      వాడుక / Usage      న వ్య రుచిర కాంచ న కిరీటుఁ గానరే    గ హనపదవిఁ గురవ కం బులార!    గ హనపదవి గురవ క నివాసిఁ గానరే    గ ణికలార! చారు గ ణికలార!    Have you seen the One with the dazzling new golden crown?    O Amaranths! that line the deep jungle paths     Have you seen the One who dwells amongst the  Red chrysanthema  of the forest?    O beautiful wild jasmines! O elegant female elephants! Have you?    మెదడుకు మేత / Food for thought        వీడ్కోలు, వీడ్కోలు! ఈ విరహం ఒక తియ్యని బాధ. మరల రేపు భానుడు ఉదయించేంతవరకు నేను వీడ్కోలు పలుకుతూనే ఉంటాను.      -- రోమియో అండ్ జూలియట్, విలియం షేక్...

అగ్గము

  అక్టోబర్ 28, 2026 అగ్గము ( aggamu )     అర్థము      (విశేష్యము) : కనబడేది; స్వాధీనం; అందుబాటులో ఉన్నది    Meaning     (noun ) :  that which is seen or can be attained; object; custody      వాడుక / Usage      అం గ జునైనఁ జూడ హృద యం గముఁడై కరఁగించు వాఁడు శ్రీ    రం గ దురంబు వాఁడు, మధు రం బగు వేణురవంబు వాఁడు మ    మ్మం గ జుపువ్వుఁదూపులకు న గ్గము చేసె లవంగ! లుంగ నా    రం గ ములార! మీకడకు రాఁ డు గదా! కృప యుంచి చూపరే!    A mere glance at Him enamours even Cupid    Lakshmi ensconced in his chest, notes mellifluous of the flute    To the flowery arrows of Cupid he has made us subject    O Clove, Citron, Orange! hope he isn't with you! kindly show Him!    మెదడుకు మేత / Food for thought      నిజమైన ప్రేమ యొక్క ప్రయాణం ఎప్పుడూ సులువుగా సాగదు.      -- ఎ మిడ్‌సమ్మర్ నైట్స్ డ్రీమ్, విలియం షేక్‌స్పియర...

పున్నాగము

  అక్టోబర్ 27, 2026 పున్నాగము ( punnāgamu )     అర్థము      (విశేష్యము) : తెల్ల కలువ; పురుషులలో శ్రేష్ఠుడు; ఇంద్రుని ఏనుగు; జాజికాయ    Meaning     (noun ) :  white lotus; an eminent man; nutmeg      వాడుక / Usage     పు న్నాగ కానవే! పు న్నాగ వందితుఁ-    ది లకంబ! కానవే తి లకనిటలు;    ఘ నసార! కానవే ఘ నసారశోభితు-   బం ధూక! కానవే బం ధుమిత్రు;    మ న్మథ! కానవే మ న్మథాకారుని-    వం శంబ! కానవే వం శధరునిఁ;    జం దన! కానవే చం దనశీతలుఁ-    గుం దంబ! కానవే కుం దరదను;    O Lotus plant, did you see? the One revered by eminent men    O Kumkum tree,  did you see? the One with scarlet forehead    O Camphor tree, did you see? the One radiant as camphor    O Midday flower, did you see? the One who is a friend to all    O Wood apple, did you see? the One who stirs all hearts    O Bamboo, did you ...

పింఛము

  అక్టోబర్ 26, 2026 పింఛము ( pinchhamu )     అర్థము      (విశేష్యము) : నెమలి పురి; కృష్ణుని శిరోభూషణము    Meaning     (noun ) :  feathers in peacock's tail; adornment in Krishna's head      వాడుక / Usage      న ల్ల నివాఁడు పద్మనయ నం బులవాఁడు గృపారసంబు పైఁ     జ ల్లె డువాఁడు మౌళిపరి స ర్పిత పింఛము వాఁడు నవ్వు రా     జి ల్లె డు మోమువాఁ డొకఁడు చె ల్వల మానధనంబుఁ దెచ్చె నో!     మ ల్లి యలార! మీ పొదల మా టున లేఁడు గదమ్మ! చెప్పరే!    Dark and lotus eyed is he; nectar of grace    in abundance gives he;  peacock feather adorning    the  crest, an ever smiling beatific face; pride and    modesty of us maidens alas he has taken!    O Jasmines! hiding in your shrubs, hope he is not! please tell!    మెదడుకు మేత / Food for thought      నీ మనస్సాక్షితో నువ్వు నిజాయితీగా ఉండు.     -- హామ్లె...

కందకం

  అక్టోబర్ 23, 2026 కందకం ( kandakamu )     అర్థము      (విశేష్యము) : పొలంలో నీరు పోవడానికి తీసే కాలువ; అగడ్త; గొయ్య    Meaning     (noun ) :  a ditch; trench      వాడుక / Usage      నేను మీ వాదాన్ని ఖండించను, కల్మష కందకం అని వాడండి.    I will not condemn your argument but call it a cesspit.    మెదడుకు మేత / Food for thought     ఈ జీవితానికర్థం ఎందుకుండాలో! అర్థం లేదనే తలంపులో నిరుత్సాహం, బాధలేవు . కొత్తబలం, వికాసం, దృఢనిశ్చయం ఉంటాయి. పునాదులు తవ్వాలి; భవనాలు లేవనెత్తాలి. సెలయేళ్ళు మహానదులు కావాలి. విత్తనాలు చల్లాలి. మహారణ్యాలు సృష్టించాలి. మానవుడికి కావాల్సింది మతాలు, దేవుళ్ళు, మ్రొక్కుబళ్లు, రాజకీయాలు కావు: మానవుడికి కావాల్సింది దయ - కొంచం, కాస్త ఐనా చాలు.     -- చివరకు మిగిలేది, బుచ్చి బాబు

మొర

  అక్టోబర్ 22, 2026 మొర ( mora )     అర్థము      (విశేష్యము) : ఆర్తనాదం; పశువుల యొక్క పొడవాటి ముఖం    Meaning     (noun ) :  a cry or lamentation; long face of cattle      వాడుక / Usage      స్తీలు స్వతంత్రం కావాలని మొరె ట్టుకుంటున్నారు.    Women are crying out for freedom.    మెదడుకు మేత / Food for thought     సంఘాన్ని మార్చలేడు . మనుషుల్ని మార్చలేడు. మారిస్తే బాధ. పగ. యుద్ధం. తనతో తను సమాధాన పడాలి. అది ఈనాటికి సాధించాడు. ఒక ప్రశాంతత, పవిత్రమైన మహత్తర ఆనందం అతనిలో ఉద్భవించింది. అది బాహ్య ప్రపంచంలో లేదు. మంటని చల్లార్చే మంచు కణాల ప్రవాహం అతని హృదయం. పిచ్చి ప్రపంచాన్ని దయతో దూరంగా వుంచే ఔదార్యం. మతాన్ని, దైవాన్ని, మనుషుల్ని తోసేసి సంతృప్తి చెందే ఆధ్యాత్మిక దృష్టి తనలో కడసారి యథార్థం.     -- చివరకు మిగిలేది, బుచ్చి బాబు

నెరవేరు

  అక్టోబర్ 21, 2026 నెరవేరు ( neraveru )     అర్థము      (క్రియ) : పొందు; సిద్ధించు;ముగియు; సమాప్తమవ్వు    Meaning     (verb ) :  to be fulfilled/done; accomplished      వాడుక / Usage      సృష్టి శక్తుల చేతుల్లో పురుషుడు ఒక కీలుబొమ్మ, ఒక పరికరం - తన కర్తవ్యం నెరవేర గానే?    Man is a puppet, an instrument of the forces of nature - once duty is done?    మెదడుకు మేత / Food for thought     అతను జయించిన పరదేశాలన్ని మహా రాజ్యాలయ్యాయి, అతని స్వదేశం శ్మశానమైనది. అతన్ని ప్రేమించిన స్త్రీలందరూ రాణులయ్యారు. అతను ప్రేమించింది అడుక్కు తింటోంది. గడ్డిపోచ బంగారు కణికయింది. పిచ్చి పుష్పం మణి, మట్టి వెన్నెలయింది; కణికలు, మణులు, వజ్రాలు, వెన్నెల మంట కలిశాయి. శరీరాన్ని ఎందరెందరో పంచుకున్నారు; కీర్తిని కాజేశారు. ప్రేమని విషం పోసి హత్య చేశారు. సౌందర్యం జుట్టు విప్పుకుని యవ్వనాన్ని కౌగలించుకుని యేడ్చింది. శాంతం అహానికేసి తల పగలగొట్టుకుంది. దయని పగ పొడిచింది. మతాన్ని విజ్ఞానశాస్త్రం పూడ్చ...

జాస్తి

  అక్టోబర్ 20, 2026 జాస్తి ( jāsti )     అర్థము      (విశేషణము) : (అరబిక్/పెర్షియన్ నుంచి) ఎక్కువ; అధికం    Meaning     (adj ) :  extra, additional; excess      వాడుక / Usage      ఎక్కడ చూసినా ఈ ప్రేమ న్యూసెన్స్ జాస్తి గా ఉంది.    There is a lot of tomfoolery regarding love all around.    మెదడుకు మేత / Food for thought     ధనమా! భవనాలు, కార్లు, బాంక్ పుస్తకాలు, రెండు కళ్ళ మధ్య పరాయి స్త్రీ రొమ్ముల బరువు, వేడి శ్వాస మధ్య              ఉక్కిరి బిక్కిరి కావడం, అందరి మీద అధికారం, తనకి తనే దాస్యం, నలుగురు యువకులు నాలుగు కుక్కలు;              పారేసిన విస్తళ్ళ కోసం తన్నుకులాడుతుంటే , కారులో కళ్ళు మూసుకుని కూర్చోడం  - తన జాగిలాన్ని వాళ్ళ మీదకి      ఉసికొల్పడం - అదా ధనం!      కీర్తా! ఏమో, ఉపన్యాస వేదికల మీద మహానుభావుడు - వంటింట్లో మృగం, గ్రంథాలలో గొప్పవాడు, పడగ్గ...

అభినయము

  అక్టోబర్ 19, 2026 అభినయము ( abhi-nayamu )     అర్థము      (విశేష్యము) : నటన; మనోభావాన్ని మాటలతో గాక చేతలతో చూపించడం    Meaning     (noun ) :  theatrical action; gesticulation      వాడుక / Usage      జగన్నాథం బాధపడుతున్న వాడల్లే అభినయం సాగించాడు.    Jagannatham continued to act like he was suffering.    మెదడుకు మేత / Food for thought     చివరికి మిగిలిందేది? మంచికి కావాల్సింది మూడు; ప్రేమ, ధనం, కీర్తి. మొదటిది యవ్వనంలో, చివరిది చివరిలో, రెండోది ఎప్పుడూ కావాల్సింది. రెండోది ఉంటే మొదటిది, చివరిదీ యిట్టే లభ్యమౌతాయి అనాలి. కానీ అతనికేం కావాలో అతనికి తెలీక, ఇప్పుడతనికి ఏమీ అక్కర్లేదు!     ప్రేమా!     నీరసించిన నరాలు, కాలే నుదురు, ఎండిన నాలుకా....దానికోసం దగాలు, స్నేహాలు? మనస్సులు కలబోసుకోటం, గుండెలు విడిపోవటం, కుట్రలు, నాటకాలు.     మబ్బు, మేఘాలు, కెరటాల తుంపర, పువ్వు వికసించటం, సంధ్య మంచులో నదీ, మేక అరుపు, పిల్లల ఆట, కుక్క విశ్వాసం, పిల్లల...

బాష్పము

  అక్టోబర్ 16, 2026 బాష్పము   ( bāshpamu )     అర్థము      (విశేష్యము)  : కన్నీరు; ఆవిరి    Meaning     (noun )  :  a tear; smoke      వాడుక / Usage      కృష్ణ శాస్త్రి ఒక స్వప్నం ఒక బాష్పం     మెదిపిన సుగంధ ద్రవ్యం    Krishna Sastri is a dream, is a rolling tear     a wafting scent    మెదడుకు మేత / Food for thought     ముసలిదైపోయింది భూమి     మూర్ఖులైన తన కొడుకుల్ని నమ్ముకుని     ముసురుకున్న బాధల వానకారులో     మసులుకునే దెలా చివరికంటా     మసి బారింది చూపు     ససి చెడింది రూపు     సముద్రం సన్నిధిని కన్నీరు పెట్టుకుని యేడ్చింది     -- అమృతం కురిసిన రాత్రి, దేవరకొండ బాలగంగాధర్ తిలక్

మిత్తి

  అక్టోబర్ 15, 2026 మిత్తి   ( mitthi )     అర్థము      (విశేష్యము)  : మృత్యు దేవత; చావు    Meaning     (noun )  :  death      వాడుక / Usage      సమాధులు చూపించవు     మిత్తి క దయ ఉండదు     మీ రోదన మీలోనే అణుచుకుని     వెళ్లిపోండి వెళ్లిపోండి వెళ్లిపోండి    Graves don't illuminate    Death shows no mercy    Your sobs your tears suppress within    Just leave, Go go    మెదడుకు మేత / Food for thought     కురుక్షేత్రమైతే కృష్ణుణ్ణి అడుగు     పానిపట్టయితే పీష్వాల నడుగు     బొబ్బిలయితే బుస్సీ నడుగు     క్రిమియా యుద్ధం కొరియా యుద్ధం     ప్రథమ ద్వితీయ ప్రపంచ యుద్ధాలు     బిస్మార్క్ నడుగు హిట్లర్ నడుగు     బ్రహ్మదేవుణ్ణి అడుగు     -- అమృతం కురిసిన రాత్రి, దేవరకొండ బాలగంగాధర్ తిలక్

బాల్చీ

  అక్టోబర్ 14, 2026 బాల్చీ   ( baalchi )     అర్థము      (విశేష్యము)  : బొక్కెన; నీటి డోలు; చేద    Meaning     (noun )  :  bucket; pail      వాడుక / Usage      నెత్తురు వరదల్ని చుసిన మనకి     కన్నీటి వాన లెక్కా జమా?     బాల్చీ లు సిద్ధం చేయిస్తాను నేను     విధవల్ని వరుసలో నిలబెట్టండి మీరు    Streams of blood we have seen    Tears of sorrow does it count or matter?    Pails I will arrange for    Widows you get them in a row    మెదడుకు మేత / Food for thought     ఎవరు మీరంతా ఎందుకిలా వొంగిన నడుంతో కన్నీటితో     చెదిరిన జుట్టుతో జారిన పైటలతో     ఈ సమాధుల చుట్టూ వెతుక్కుంటూ తిరుగుతారు     తల్లులా భార్యలా అక్కచెల్లెండ్రా మీరు     ఏ నాటి వారు ఏ వీటివారు మీరు     ఏ యుద్ధంలో చనిపోయాడు మీవాడు ఏ దళం ఎన్నవ నంబరు     -- అమృతం కురిసిన రాత్రి, దేవరకొం...