అవాకుచెవాకు
ఫిబ్రవరి 27, 2025
అవాకుచెవాకు (avaaku-chevaaku)
అర్థము
(విశేష్యము) : పలకరాని సరైనవికాని మాటలు; లేనిపోని మాటలు; తప్పుడు మాటలు
Meaning
(noun) : incorrect and inappropriate words; unnecessary or wrong words
వాడుక / Usage
కోయకుమీ సొరకాయలు వ్రాయకుమీ నవలలని అవాకుచెవాకుల్ డాయకుమీ అరవ ఫిలిం చేయకుమీ చేబదుళ్ళు సిరిసిరిమువ్వా! ~ శ్రీశ్రీ
Bragging do not, novels inappropriate write not, approach not films melodramatic, take not petty loans, Siri Siri Muvva! ~ Sri Sri
మెదడుకు మేత / Food for thought
150 సంవత్సరాల పూర్వం కృష్ణా జిల్లా వెల్నూతల అగ్రహారంలో ఉండేవారు. అప్పట్లో అక్కడ కృష్ణా కాలువలు లేవు. విజయవాడ వద్ద ఆనకట్ట లేదు. వెల్నూతల, తరిగొప్పల రైల్వే స్టేషన్కు రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒకప్పుడది చవిటి పొలాలు కల గ్రామం. విజయవాడ వద్ద ఆనకట్ట కట్టిన తదుపరి కృష్ణా జిల్లా అదృష్టంతో పాటు ఈ గ్రామం తలరాత మారిపోయింది. కానీ మునుపు జొన్న, సజ్జ లాంటి మెట్ట పంటలే పండేవట. ఆ అన్నాలు తినలేక వర్షాలు తక్కువై ఎక్కడికి పోవాలో అని మధనపడి గుండ్లకమ్మ సంగతి విని వినుకొండ ప్రాంతానికి వచ్చారట.-- నేను నా తరం, లంకా సత్యనారాయణ, విలేఖరి, అధ్యాపకులు, బహు భాషా కోవిదులు
Comments
Post a Comment