ఆహవము
నవంబర్ 12, 2020
వచ్చే శనివారం దీపావళి కనుక ఈ వారం అదే మన నేపథ్యం!
ఆహవము (āhavamu)
అర్థము
(విశేష్యము) - యుద్ధము; పిలుపు; యజ్ఞము; నూతి దగ్గర కట్టిన నీళ్ళతొట్టి
తెలుగు సాహిత్యంలో సత్యభామ ప్రత్యేకమైన పాత్రగా రూపుదిద్దుకుంది. శృంగారావతిగా, అభిమానవతిగా, శ్రీకృష్ణుని ఇష్టసఖిగా ఆమె అందరికీ విదితమే. నరకాసుర యుద్ధంలో ఆమె చూపిన యుద్ధకౌశలానికి మాధవుడు ఆశ్చర్యచకితుడయ్యాడు.
Meaning
noun : war; calling; sacrifice; bucket to get water off a well
వాడుక / Usage
ఆహవములో అందరికంటే ఎక్కువ నష్టపోయేది చిన్నారులే.
Children suffer the most in a war.
మెదడుకు మేత / Food for thought
"తే. వీర శృంగార భయ రౌద్ర విస్మయములు
గలసి భామిని యయ్యెనో కాక యనగ
నిషువు దొడువుట దివుచుట యేయుటెల్ల
నెఱుగ రాకుండ నని సేసె నిందువదన"
(వీర, శృంగార, భయానక, రౌద్ర, అద్భుత రసాలు కలసి ఈ "వీరనారిగా"రూపొందిందా అనుకొనేలా ఆమె కనబడుతోంది.)
--పోతన (1450-1510) భాగవతం దశమ స్కంధం
Comments
Post a Comment