కరివరద
నవంబర్ 20, 2020
ఈ వారం పదాలన్నీ ఒక అరుదైన త్యాగరాజ కీర్తన నుండే! గుర్తు పట్టగలరా?
కరివరద (karivarada)
అర్థము
కరి - ఏనుగు; వరద - వరము ఇచ్చినవాడు : గజేంద్రునికి వరము ఇచ్చి రక్షించిన శ్రీ మహా విష్ణువు
Meaning
noun : Sri Maha Vishnu - the protector of the elephant king Gajendra
వాడుక / Usage
కరివరదుని తత్వమెరిగినవారు ధన్యులు.
Those who realize the nature of Vishnu are blessed.
మెదడుకు మేత / Food for thought
"మకరంద బిందు బృంద రసస్యందన
-పానుగంటి లక్ష్మీ నరసింహరావు( 2 నవంబర్ 1865 - 1940) స్వభాష లో జంఘాల శాస్త్రి
సుందరమగు మాతృభాషయే
మహానంద కందళ సందోహ
సంధాన తుందిలమగు మాతృ భాషయే
క్రమతకు క్రమత
వదులునకు వదులు బిగికి బిగి
జోరునకు జోరు నెదురెక్కునకు నెదురెక్కు
మందతకు మందత ధాటికి ధాటియు
అన్ని వన్నెలు నన్ని చిన్నెలు
అన్ని వగలు నన్ని ఒద్దికలు
అన్ని తళుకులు నన్ని బెళుకులు
అన్ని హొయలు నన్ని యొయ్యారములు
గలిగినది మన మాతృభాషయే"
-పానుగంటి లక్ష్మీ నరసింహరావు( 2 నవంబర్ 1865 - 1940) స్వభాష లో జంఘాల శాస్త్రి
Comments
Post a Comment