సుప్రతీకము

 

   నవంబర్ 10, 2020


    వచ్చే శనివారం దీపావళి కనుక ఈ వారం అదే మన నేపథ్యం!

  సుప్రతీకము (su-pratīkamu)


    అర్థము

     (విశేష్యము) - ఈశాన్యపు దిశలోని బలమైన ఏనుగు; మంచి అవయములు. ప్రతీకము అనగా అవయవం

    నరకాసురుడు రాజధాని ఈశాన్య నగరమైన ప్రాగ్జోతిషపురం (గౌహాతి). అతనికి అతిబలవంతమైన                  సుప్రతీకము అనే ఏనుగు ఉండేది. (అతని కుమారుడు భగదత్తుడు ఈ ఏనుగుతో  కురుక్షేత్ర సంగ్రామంలో        పాండవులపై స్వైర విహారం చేసాడు.) నరకుడి మదగర్వంతో  సర్వలోకాలు తల్లడిల్లి పోయాయి.

   Meaning

     noun :strong elephant from north east ; strong limbs      

     వాడుక / Usage

    సుప్రతీకమైన మల్లయోధులు వ్యాయామసాలలో కసరత్తు చేసారు.

    Strong limbed wrestlers exercised in the gym.

    మెదడుకు మేత / Food for thought

    "జ్ఞానానికి రెండువైపులా పదును ఉంది. జ్ఞానభాండారాన్ని ఎప్పటికప్పుడు నింపుకుంటూ ఉంటేనే అది మానవుని అభివృద్ధికి ఉపయోగపడుతుంది. దానికి నిత్య నైవేద్యం అవసరం లేకపోతే తిరిగి తన్ను సృష్టించిన మానవ జాతినే సర్వనాశనం చేస్తుంది."

            -- గోపీచంద్ (8 సెప్టెంబర్ 1910 - 1962), అసమర్థుని జీవయాత్ర లో  రామయ్య తాత 

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి