శౌరి
నవంబర్ 11, 2020
వచ్చే శనివారం దీపావళి కనుక ఈ వారం అదే మన నేపథ్యం!
శౌరి (ṣauri)
అర్థము
(విశేష్యము) - శ్రీ కృష్ణుడు; శూరసేనుని మనుమడు. శూరసేనునికి పిల్లలు వసుదేవుడు, కుంతీదేవి.
నరకాసురుడు అఘాయిత్యాలు అరికట్టమని ఇంద్రుడు మొరపెట్టుకోగా గోపాలుడు సత్యభామా సమేతంగా ప్రాగ్జోతిషపురం మీద దండయాత్ర వెళ్ళాడు. ద్వాపర యుగంలో భూదేవి సత్యభామగా అవతరించింది.
Meaning
noun : Lord Krishna
వాడుక / Usage
శౌరి యొక్క శంఖము పేరు పాంచజన్యము.
Shouri's conch is called Panchajanya.
మెదడుకు మేత / Food for thought
"ఏటికాడ శాపమ్మ ఎగిరి తాను సూసింది
ఏడ నావోడంటే ఏటిలోన మునిగింది
శాప మునిగినకాడ శతకోటి సున్నాలు
శాపమైన గుండెలోన సెప్పలేని సుడిగుండాలు"
--వేటూరి సుందర రామమూర్తి (29 జనవరి 1936 - 2010) - పాటేదో కనుక్కోండి!
Comments
Post a Comment