దీపశిఖా
నవంబర్ 13, 2020
వచ్చే శనివారం దీపావళి కనుక ఈ వారం అదే మన నేపథ్యం!
దీపశిఖా (dīpaṣikā)
అర్థము
కాటుక - దీపశిఖ లోంచి వచ్చినది; కాళిదాసు - దీపశిఖని ఉపమానంగా వాడి ఖ్యాతి ఆర్జించిన మహాకవి
సత్యభామ సమేతుడై మురారి, లోకకంటకుడైన నరకుడిని ఆశ్వయుజ చతుర్దశినాడు అంతమొందించాడు. భూలోకవాసులు ఆనందంతో మర్నాడు అమావాస్య రోజున చీకటిని(అజ్ఞానాన్ని) పారద్రోలుతూ దీపాలు
(జ్ఞానాన్ని)వెలిగించి, బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు.
Meaning
noun : collyrium, dark eye shadow ; The poet Kalidasa
వాడుక / Usage
కళ్ళకు దీపశిఖా పెడితే అందం.
Collyrium in the eyes is beautiful.
మెదడుకు మేత / Food for thought
"సంచారిణీ దీప శిఖేవ రాత్రౌ
యం యం వ్యతీయాయ పతింవరా సా
నరేంద్ర మార్గాట్ట ఇవ ప్రపేదే
వివర్ణ భావం సస భూమిపాల:"
(ఆ స్వయంవర సభలో ఇందుమతి నడుస్తున్న దీపశిఖ లా ఉంది. చీకట్లో రాజవీధిలో ఓ దీపశిఖ నడుస్తుంటే ఒక్కో గుమ్మం, జ్వాల దగ్గరవుతున్నకొద్దీ ప్రకాశిస్తూ, జ్వాల దాటగానే చీకట్లో మునిగినట్టుగా, ఒక్కో రాజు ముఖం ఇందుమతి సమీపిస్తుంటే ప్రకాశిస్తూ, దాటిపోతుంటే నల్లబడిపోతోంది.)
--మహాకవి కాళిదాసు (నాలుగవ శతాబ్దం) రఘువంశం
Comments
Post a Comment