వ్యాసార్థము
నవంబర్ 30, 2020
పోయిన వారం మాటలు అన్నీ స్వాతికిరణం చిత్రంలో సీతారామశాస్త్రిగారి కలంనుంచి వెలువడిన "ప్రణతి ప్రణతి ప్రణతి" పాటలోనివి...
ఈ వారం పదాలన్నీ గణితం నుండి! లెక్క కట్టండి..
వ్యాసార్థము (vyāsardhamu)
అర్థము
(విశేష్యము): వృత్తం(circle) మీద ఉన్న రెండు బిందువులును(points) కలుపుతూ వృత్త కేంద్రం(centre) గుండా పోయే రేఖా ఖండం(line segment) వ్యాసము(diameter) అంటారు. దానిలో సగము వ్యాసార్ధము. అంటే వృత్త కేంద్రం నుండి వృత్తం మీద ఉన్న ఏదైనా బిందువుని కలిపే రేఖా ఖండం.
Meaning
noun : half the diameter of a circle - radius
వాడుక / Usage
ఒక వృత్తం చుట్టుకొలతలో(circumference) ఎన్ని వ్యాసార్థములు ఉంటాయి?
How many radii are in the circumference of a circle?
మెదడుకు మేత / Food for thought
"ఒక చతురస్రం (square) యొక్క వికర్ణ (diagonal) కూడా సాగతీసిన తాడు ఆ చతురస్రానికి రెండింతల వైశాల్యంగల (area) చతురస్రం చేస్తుంది."
"The rope which is stretched across the diagonal of a square produces an area double the size of the original square."
Comments
Post a Comment