రౌద్రము

  

డిసెంబర్ 14, 2020

నవరసాలలో కొన్ని....

రౌద్రము (raudramu)


    అర్థము

     (విశేష్యము): ఎండ; దినభాగములు(15)లో మొదటిది; రుద్రునిది; నవరసాలలో ఒకటి
     (విశేషణము): భయంకరమైన, తీక్షణమైన

   Meaning

     (noun) : heat; one of nine emotions; wrath, rage

     వాడుక / Usage

      బొబ్బిలి యుద్ధం చిత్రంలో ఎస్ వి రంగారావు తాండ్ర పాపారాయుడి పాత్ర రౌద్రానికి పరాకాష్ఠ.
      SV Ranga Rao's role as Tandra Paparayudu in Bobbili Yuddham movie is the epitome of rage.

    మెదడుకు మేత / Food for thought

   "పులి పులి బెబ్బులి పులి! నీ పొడుపులకు హడలి పారిపోడానికి ఇది అడవి పులి కాదు విజయరామ, ఇది బెబ్బులి పులి. నీ అంతిమ యాత్రకు ఇదే తగిన సమయము. మా బెబ్బులి కోటను స్మశానవాటిక చేసిన కఠినాత్ముడవు. నువ్వు రెచ్చగొట్టిన ఆ రణ పిశాచికి నిన్నే ఆహుతి చేస్తాను. నీ పేరాశకు ఇదే బహుమానం...మీరా నన్ను బంధించేది. ఈ గడ్డపై పుట్టిన వీరులకు చంపడం చావడమే కాని బంధీలు కావడం అలవాటు లేదు"

        --- బొబ్బిలి యుద్ధం పతాక సన్నివేశంలో తాండ్ర పాపారాయుడిగా ఎస్ వి రంగారావు (జులై 3 1918 - 1974)

Comments