గ్రహశకలం
డిసెంబర్ 22, 2020
పైకి చూడండి...
గ్రహశకలం (grahasakalam)
అర్థము
(విశేష్యము): స్వల్ప గ్రహాలు, అంగారక(Mars) మరియు బృహస్పతి(Jupiter) మధ్య ఉండి సుర్యుని చుట్టూ తిరిగే చిన్న గ్రహాలు.
Meaning
(noun) : asteroids, typically found in the asteroid belt between Mars and Jupiter
వాడుక / Usage
గ్రహశకలంలో చిన్న శకలం భూమి యొక్క వాతావరణంలో ప్రవేశించి, మండిపోయి కాంతి పుంజం అవ్వడాన్ని ఉల్క అంటారు.
When a small piece of an asteroid burns up on entering earth's atmosphere, creating a streak of light, it's called a meteor.
మెదడుకు మేత / Food for thought
"చరిత్ర తారసపడినప్పుడు మన బుద్ధి "అస్పష్ట త్రయం" అనే రుగ్మతకు లోనవుతుంది.
1. అవగాహన అయ్యిందనే భ్రమ - యాదృచ్చికమైన క్లిష్టమైన ఘటనలుండే ప్రపంచం అర్ధం అయ్యిందనుకోవడం
2. పునరవలోక వక్రీకరణ - అయిపోయిన వాటిని భేరీజు వేసి తేటతెల్లం అనుకోవడం. వాస్తవానికి
వ్యతిరేకంగా, చరిత్ర పుస్తకాలలో చరిత్ర స్పష్టంగా వర్గీకరించినట్లు ఉంటుంది.
3. విద్యావేత్తల ప్రతిబంధకం - ప్రతీ అంశాన్ని వర్గాలలో విభజించే తత్త్వం."
--- నసీం నికోలస్ తాలిబ్, బ్లాక్ స్వాన్ పుస్తకంలో
Comments
Post a Comment