గురుత్వాకర్షణ
డిసెంబర్ 24, 2020
పైకి చూడండి...
గురుత్వాకర్షణ (gurutvākarshaṇa)
అర్థము
(విశేష్యము): గురుత్వము - బరువు, గొప్పతనము, గురుభావము; ఆకర్షణ - లాగడం, సమ్మోహనం
అంటే బరువు ఉన్న వస్తువులు ఒక దానిని ఒకటి ఆకర్షించుకోవటం
Meaning
(adjective) : gravitational pull/attraction
వాడుక / Usage
ఖగోళంలో గ్రహాల పరస్పర గురుత్వాకర్షణ వల్ల తమకు తామే అలా నిలిచియున్నాయని భాస్కరాచార్యుడు లీలావతి అనే గ్రంధంలో చెప్పాడు.
In the book Lilavathi, Bhaskaracharya states that planets in space hold their position because of gravitational attraction.
మెదడుకు మేత / Food for thought
"ఒక సిద్ధాంతం శాస్త్రపరమైనది అనడానికి అది విషయాలను రెండుగా విభజించాలి - ఒక సమూహంలో ఆ సిద్ధాంతానికి అనుకూలంగా ఉండే విషయాలు; ఇంకో సమూహంలో దానికి ప్రతికూలంగా ఉండే విషయాలు."
(హంసలు అన్నీ తెలుపు అనేది తప్పు అనడానికి వేరే రంగు హంస ఒకటి చూపితే చాలు)
--కార్ల్ పాపర్ (28 జులై 1902 - 1994), తత్వవేత్త , 'ది లాజిక్ ఆఫ్ సైంటిఫిక్ డిస్కవరీ' లో అప్రామాణికం (falsifiability) గురించి
Comments
Post a Comment