ఘడియ

    

డిసెంబర్ 28, 2020

ఈ అనంత కాల ప్రవాహాన్ని ఎలా కొలిచేది?

ఘడియ (ghaḍiya)

    అర్థము

     (విశేష్యము): ఒక రోజులో అరవయ్యో భాగం అనగా ఇరవై నాలుగు నిముషాల కాలం;ప్రకృతి - ఘటిక; వికృతి -                             ఘడియ, గడియ
    

   Meaning

     (noun) : sixtieth part of a day ie 24 minutes

     వాడుక / Usage

    కరోనా లేని శుభ ఘడియల కోసం ప్రపంచం ఎదురు చూస్తోంది.
    The world is waiting for the good times, free of corona.

    మెదడుకు మేత / Food for thought

    ‘‘కాలం చెప్పినట్లు ఎవరైనా నడవాల్సిందే గాని హుంకరిస్తే వినాశనమే మిగిలేది.కాలం చెప్పేది ఒక్కటే. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా నాలాగా ప్రశాంత చిత్తంతో ఉండు. ప్రశాంతంగా నీపని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఎన్నో ప్రళయాలను చవిచూచింది కాలం. ఎందరో మహానుభావులైన ఋషులు, మునులు, పెద్దలు, వారికి వెయ్యిరెట్లు పనికిమాలిన నీచ్యాతి నీచ్యులు కాలగర్భంలో కలిసిపోయారు. కాని, కాలం మాత్రం అన్నిటిని స్థిరంగా తీసుకుంది. మంచీ లేదు. చెడు లేదు, రాగం లేదు, ద్వేషం లేదు. ఎవ్వరైనా ఒక్కటే తనలో కలిపేయడం.కాలం అందరిని సృష్టిస్తుంది. కాని తను సృష్టించిన వస్తువు వెనక పడదు. కాని మానవుడు తను సృష్టి చేసిన వస్తువు వెనకనే తిరుగుతున్నాడు. అదే లోకం అదే సర్వస్వం అనుకుంటున్నాడు, దాసోహమై తనకి ఉన్నశక్తిని కోల్పోతున్నాడు.’’

--బొక్కా సత్యశివబాలబాలాజీ (అంతర్జాలం నుండి)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి