లిప్త

 

డిసెంబర్ 29, 2020

ఈ అనంత కాల ప్రవాహాన్ని ఎలా కొలిచేది?

లిప్త (liptha)

    అర్థము

     (విశేష్యము): 0.4 సెకన్లు; ఘడియలో అరవయ్యో భాగం విఘడియ(24 సెకన్లు), విఘడియలో అరవయ్యో భాగం                           లిప్త; అతి చిన్న సమయం
    

   Meaning

     (noun) : 60*60*60 part of a day ie 0.4 seconds ; very short time

     వాడుక / Usage

    లిప్త కాలంలో ఆమె కల చెదిరిపోయింది.
    Her dreams were shattered in a fraction of a second.

    మెదడుకు మేత / Food for thought

    ‘‘నశించే జీవరాశులు ఇంకో జీవాన్ని స్పృశిస్తాయి
       వంతులవారీగా ఊపిరి పోసుకుని, వదులుతాయి
       సంద్రంపై బుడగలవోలె భౌతిక సాగరంలో పుడుతున్నాయి
       పైకి లేచి, బ్రద్దలై కడలిలో కలుస్తున్నాయి.
        కాదేది పరాయి, అంశాలన్నీ పూర్ణానివే;
        ఏకమై పరివ్యాప్తమై, సర్వ నిక్షిప్తమైన ఆత్మ
        ముడివేయు ప్రతి ప్రాణిని, పెద్దదైన చిన్నదైనా;
        మనిషి కోసం మృగం, మృగం కోసం మనిషి;
        అన్నీ పొందే అన్నీ ఇచ్చే: లేదేది ఒక్కటై;
        ఈ శృంఖల నిఖిలం, అంతులేని అఖిలం."

    --అలెగ్జాండర్ పొప్ (మే 21 1688 - 1744) 'An essay on Man' నుంచి అనువాదం

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి