ఝాము
డిసెంబర్ 30, 2020
ఈ అనంత కాల ప్రవాహాన్ని ఎలా కొలిచేది?
ఝాము (ḍzāmu)
అర్థము
(విశేష్యము): ఏడున్నర ఘడియలు అనగా మూడు గంటలు; ప్రహర; రోజులో ఎనిమిదవ భాగం
Meaning
(noun) : eighth part of a day; 3 hours
వాడుక / Usage
తెల్లవారు ఝామున లేచి ప్రయాణం కొనసాగించెను.
She woke up early in the morning and resumed her journey.
మెదడుకు మేత / Food for thought
‘‘న పుణ్యం న పాపం న సౌఖ్యం న దు:ఖం
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞా:అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానంద రూప: శివోహం శివోహం
అర్ధం–పుణ్యపాపాలు, సుఖదుఖాలు నాకు లేనే లేవు.
మంత్రం లేదు, క్షేత్రములు లేవు. వేదాలు,యజ్ఞాలు అసలు లేనే లేవు.
నేను భోజనాన్ని కాను, భోజ్యమూ కాను, భోక్తను కాను.
చిదానంద రూపము కల శివుడను! శివుడనే తప్ప మరి వేరవరినీ కాను."
--నిర్వాణ షట్కము, ఆది శంకరాచార్య
Comments
Post a Comment