మన్వంతరం
జనవరి 01, 2021
ఈ అనంత కాల ప్రవాహాన్ని ఎలా కొలిచేది?
మన్వంతరం (manv-antaramu)
అర్థము
(విశేష్యము): డెబ్బైఒకటి చతుర్యుగములు - 306, 720, 000 సంవత్సరాలు; హయాము, పాలన
Meaning
(noun) : 71 * total of (Kritha, Tretha, Dwapara, Kali) yugas = 306, 720, 000 years; reign, rule
వాడుక / Usage
పురాణాల ప్రకారం ఒక మనువు యొక్క పాలనా కాలాన్ని మన్వంతరము అంటారు.
According to the Puranas, the reign of one Manu is called Manvantaram.
మెదడుకు మేత / Food for thought
‘‘అవలోకించగలిగిన విశ్వము యొక్క వయసు 1,380 కోట్ల సంవత్సరాలు. దానిని ఒక సంవత్సరంలోకి కుదిస్తే మహా విస్ఫోటనం (Big Bang) జనవరి 1 అర్ధరాత్రి (01/01 00:00) అయినట్టు. మానవుడు (Homo Sapiens) మొదట కనపడేది డిసెంబర్ 31 పది గంటల ఇరవై నాలుగు నిమిషాలకు(31/12 22:24). ఇప్పుడు సమయం 23:59:59. సుమారు 440 ఏళ్ళు నుంచి అదే సమయంలో ఉన్నాము. మన ప్రస్తుత పరిస్థితి చూస్తే మళ్ళీ అర్ధరాత్రి అయ్యేలోపు నశించిపోయేటట్లే ఉన్నాము. విశ్వము మాత్రం ఉంటూనే ఉంటుంది. మనం ఇల్లు అని చెప్పుకునే ఈ నీలపు చుక్క సూర్యరశ్మిలో వేళ్ళాడే చిన్న దుమ్ము కణము మాత్రమే. మనం నిజంగా అకించిత్కరమే ."
--- https://aeon.co/essays/just-a-recent-blip-in-the-cosmos-are-humans-insignificant
Comments
Post a Comment