అభిసారిక
జనవరి 18, 2021
ఆమె....
అభిసారిక (abhisarika)
అర్థము
(విశేష్యము): ప్రియుడి కోసం సంకేత స్థలమునకు వెళ్లే నాయిక; రహస్యంగా ప్రియుడిని కలవడం కోసం వెళ్లే స్త్రీ
Meaning
(noun) : a lady who goes to meet her lover at an appointed place
వాడుక / Usage
"విరహ వేదనతో ప్రియుని కోసం అభిసారిక ఆలపించే కరుణ రసాత్మక రాగం 'భాగేశ్వరి'."
"Raag Bhageswari is the tender longing of a woman going to meet her lover."
మెదడుకు మేత / Food for thought
"నా గది స్వప్నాలతో నిండిపోయింది
నా మది స్వగతాలతో కుంగిపోతోంది
ఇంక రావెందుకు ప్రభూ
శంకాకులమై ఈ రాత్రి సడలిపోతోంది
నా వొంటి నిగనిగలవంటి శయ్యను సజ్జితం చేశాను
నా కంటి మిలమిలవంటి మధువు పాత్రల నింపాను
త్వరమాణమై ప్రభూ, నా
తనువు స్వీయ యౌవన భారన తడబడి పోతూన్నది."
-- దేవరకొండ బాలగంగాధర్ తిలక్ (ఆగష్టు 1, 1921 - 1966), విరహోత్కంఠిత
Comments
Post a Comment