సంధాత్రి
జనవరి 27, 2021
ఈ మాటలు ఏ సినిమాలోని పాటలనుంచి?
సంధాత్రి (sandhāthri)
అర్థము
(విశేష్యము): సంధానం - కూర్చుట, కలుపుట, సంధి చేయుట; సంధాత్రి - సంధానం చేయు స్త్రీ
Meaning
(noun) : one who unites or reconciles
వాడుక / Usage
రుద్రమదేవి అఖండ కాకతీయ సామ్రాజ్యానికి సంధాత్రి.
Rudrama Devi united the vast Kakatiya empire.
మెదడుకు మేత / Food for thought
"దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టవోయ్
గట్టిమేల్ తలపెట్టవోయ్
దేశాభిమానం నాకు కద్దని
వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్
పూని ఏదైనాను ఒక మేల్
కూర్చి జనులకు చూపవోయ్
సొంత లాభం కొంత మానుకు
పొరుగు వానికి తోడుపడవోయ్
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్"
-- గురజాడ అప్పారావు (సెప్టెంబర్ 21, 1862 - 1915) హేతువాది, సాంఘిక సంస్కర్త, రచయిత
Comments
Post a Comment