నడమంత్రపు
జనవరి 29, 2021
ఈ మాటలు ఏ సినిమాలోని పాటలనుంచి?
నడమంత్రపు (nadamantrapu)
అర్థము
(విశేష్యము): ఈ మధ్య కాలంలో, కొత్తగా, ఇటీవల; నడమ - నడుము, మధ్య; అనంతరం - పిమ్మట, తర్వాత
Meaning
(adjective) : recently, not too far back, new
వాడుక / Usage
నడమంత్రపు సిరికి నెత్తిమీద కండ్లు అని నానుడి.
It is said that recently acquired wealth makes one haughty.
మెదడుకు మేత / Food for thought
"పెళ్లనేది ఇద్దరి మనుషుల్ని కలపడానికి కాదు, రెండు మనసుల్ని కలపడానికి. త్రికరణ శుద్ధిగా ఆచరించని పని వ్యర్ధమని శాస్త్రం చెప్తోంది....పెళ్లంటే శోభనం ముందు జరిగే తంతు కాదు. ఒక పురుషుడిని ఒక స్త్రీని స్నేహితులుగా సన్నిహితులుగా చేసే ఘట్టం....పరమాత్ముని అర్చించుకోవటానికి ఆ నాలుగు గోడల మధ్యే కూర్చోవక్కర్లేదు...నిరాకారుడైన ఈశ్వరుడిని నా మనసులో చూసుకోగలను ధ్యానించుకోగలను. ఇది నాకు పునర్జన్మ. గాఢాంధకారం అలుముకున్న ఈ ఒడ్డు విడిచి వెలుగు రేఖలు నిండి ఉన్న ఆ ఒడ్డుకు చేరుకోపోతున్నాను...కాగితం గాలికి రెపరెపలాడకుండా బరువుకి రాయి ఉంచినట్టు మానవ సంఘం అవినీతికి చిన్నాభిన్నం అవ్వకుండా ఆచారం అనే బాధ్యత ఉంచబడింది. అంతేకాని వాటి పేరుతో మనిషిని మనిషిని వేరు చేయడానికి కాదు."
-- సప్తపది - కే విశ్వనాధ్ రూపకల్పన, జంధ్యాల కలం, వేటూరి గేయం
Comments
Post a Comment