స్థితప్రజ్ఞుడు
జనవరి 04, 2021
మనుషులు అనేక రకాలు!
స్థిత ప్రజ్ఞుడు (sthitha-pragnyudu)
అర్థము
(విశేష్యము): స్థిత - నిలుచున్నది; స్థిరముగా ఉన్నది: ప్రజ్ఞుడు - పండితుడు; బుద్ధిమంతుడు;
దుఃఖము కలిగినపుడు దిగులు చెందనివాడు, సుఖములు కలిగినపుడు స్పృహ లేనివాడు, రాగము, ద్వేషము,
భయము లేనివాడు, ఆత్మ స్వరూపం తెలిసినవాడు స్థితప్రజ్ఞుడని భగవద్గీత సాంఖ్య యోగం 55, 56 శ్లోకాలు చెప్తున్నాయి
Meaning
(noun) : one who is liberated while still living an earthly life; man of steady wisdom
వాడుక / Usage
మాజీ ప్రధాని శ్రీ పి వి నరసింహరావుగారు స్థితప్రజ్ఞుడిగా ప్రసిద్ధి చెందారు.
Former Prime Minister Sri PV Narasimha Rao is renowned as a SthithaPragnya.
మెదడుకు మేత / Food for thought
‘‘పాములాటి రాతిరి పడగదించి పోయింది
భయం లేదు భయం లేదు నిదర ముసుకు తీయండి
చావులాటి చీకటి చూరు దాటి పోయింది
భయం లేదు భయం లేదు చాపలు చుట్టేయండి
ముడుచుకున్న రెక్కలిర్చి పిట్ట చెట్టు విడిచింది
మూసుకున్న రెప్పలిరిచి చూపులెగరనియ్యండి
తెల్లారింది లెగండో కొక్కోరోకో
మంచాలింక దిగండో కొక్కోరోకో"
--- సిరివెన్నెల సీతారామ శాస్త్రి "కళ్ళు" సినిమాలో
Comments
Post a Comment