హఠవాది

 

జనవరి 06, 2021

మనుషులు అనేక రకాలు!

హఠవాది (haṭha-vādi)

    అర్థము

   (విశేషణము): పట్టిన పట్టు విడువనివాడు; మొండిగా వాదించేవాడు
    

   Meaning

     (noun) : obstinate and argumentative person

     వాడుక / Usage

    హఠవాదిని రంజింప జాలము.
    It is hard to please an obstinate person.

    మెదడుకు మేత / Food for thought

    "మానవ స్వభావం గురించి కొందరు ఈ విధంగా భయపడతారు.
           1. మనుషులలో జన్మసిద్ధంగా భేదాలు ఉంటే, సమాజ వ్యత్యాసాలు, జులుం సమర్ధించబడతాయి.
           2. మనుషులు జన్మసిద్ధంగా నీతివిహీనులయితే, మానవ సమాజాన్ని మెరుగుపరిచే ప్రయత్నం వృధా.
           3. మనుషులు జీవశాస్త్రం చెప్పినట్టు చీము నెత్తురు యొక్క ముద్దలే అయితే, స్వచ్చందవృత్తి (free will) ఒక                       మిధ్య. ఎవరినీ వారు చేసిన పనులకు బాధ్యులుగా అనలేము. 
           4. మనుషులు జీవశాస్త్ర బద్దులైతే, మానవ జీవితానికి అర్ధం పరిపూర్ణత ఉండవు.

        పైన ప్రతీ అంశం యొక్క ఆలోచన తప్పని, మానవ స్వభావాన్ని తృణీకరించడం ప్రమాదకరమని నేను    
         వాదిస్తాను"

        --- స్టీవెన్ పింకర్, 'ది బ్లాంక్ స్లేట్ (The Blank Slate)'

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి