ఉవ్వెత్తు
ఫిబ్రవరి 19, 2021
ఉవ్వెత్తు (uvv-eṭṭu)
అర్థము
(అవ్యయము): యావత్తు, పూర్తిగా, సమూహంగా, ఒక్కసారిగా, అవలీలగా
Meaning
(adverb) : entirely, without leaving any remnant, all at once, easily
వాడుక / Usage
తెన్నేటి విశ్వనాథం యొక్క ‘విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో ఉవ్వెత్తున పోరాటం ప్రారంభం అయ్యింది.
With Tenneti Viswanadham's slogan 'Visakha steel, Andhra's right' the agitation took off.
మెదడుకు మేత / Food for thought
"సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే
పరివారంబునుఁ జీరఁ డభ్రగపతిం బన్నింపఁ డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాద ప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై"
పరివారంబునుఁ జీరఁ డభ్రగపతిం బన్నింపఁ డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాద ప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై"
(గజేంద్రుని ప్రాణాలు కాపాడలనే ఉత్సాహంతో ఉన్న విష్ణుమూర్తి లక్ష్మీదేవికీ చెప్పలేదు; శంఖచక్రాలను రెండు చేతుల్లోకీ తీసుకోలేదు; సేవకుల నెవరినీ పిలువలేదు; గరుడవాహనాన్నీ సిద్దపరచకోలేదు; చెవి దుద్దు వరకు జారిన జుట్టూ చక్కదిద్దుకోలేదు; ప్రణయ కలహంలో ఎత్తిపట్టిన లక్ష్మీదేవి కొంగైనా వదల్లేదు)
-- బమ్మెర పోతన, భాగవతము అష్టమ స్కంధము
Comments
Post a Comment