కృత్రిమ మేధస్సు
ఫిబ్రవరి 12, 2021
కృత్రిమ మేధస్సు (kruthrima medhassu)
అర్థము
(విశేష్యము): ఒక యంత్రం లేక సంగణకం ప్రదర్శించే మేధస్సు. మానవులవలే పర్యావరణం అవగతం చేసుకుని, శిక్షణ పొంది సమస్య పరిష్కరించే శక్తిగల యంత్రం
Meaning
(noun) : Artificial Intelligence
వాడుక / Usage
ట్యూరింగ్ టెస్ట్ ఒక యంత్రానికి కృత్రిమ_మేధస్సు ఉందా అని నిర్ధారించడానికి అలాన్ ట్యూరింగ్ అనే బ్రిటీష్ శాస్త్రవేత్త ప్రతిపాదించిన పరీక్ష.
Turing test was proposed by British mathematician Alan Turing to test if a machine exhibits human like intelligence.
మెదడుకు మేత / Food for thought
"తాగుచుండే బుడ్డి
తరుగుచుండే కొద్ది
మెదడు మేయును గడ్డి
ఓ కూనలమ్మా
మనసు తెలుపని భాష
మంచి పెంచని భాష
ఉత్త సంద్రపు ఘోష
ఓ కూనలమ్మా
పుణ్య గాథల బూతు
బూజు పట్టిన ట్రూతు
అంతు చిక్కదు లోతు
ఓ కూనలమ్మా!"
-- ఆరుద్ర (ఆగస్టు 31, 1925 - 1998), కూనలమ్మ పదాలు
Comments
Post a Comment