ఉబలాటం
ఫిబ్రవరి 17, 2021
ఉబలాటం (ubalaatam)
అర్థము
(విశేష్యము): ఉత్సాహం, మిక్కిలి ఆసక్తి, కుతూహలం, తహతహ, ఒక పని చేయాలని తొందర లేక కోరిక
Meaning
(noun) : to be eager, curious, desire, pleasure
వాడుక / Usage
తన గుండెలో ఉన్న విషయాలు వెలికితీసి ప్రపంచానికి చెప్పాలని ఆమె ఉబలాటం.
She was eager to harness and tell the world the feelings welling in her heart.
మెదడుకు మేత / Food for thought
"అంతర్జాలం ముందు, వార్తలు పాత్రికేయుల పరిధిలో ఉండేవి. దానికి శక్తిగల సంపాదకులు, ప్రచురణకర్తలు ద్వారపాలకులుగా కాపు కాసేవారు. ఇది నవాభ్యుదయ భావాలు ప్రసార మాధ్యమాలలోకి అంత తొందరగా రాకుండా చేసి ఉండవచ్చు. కానీ అదే విధంగా విపరీతమైన ప్రజాస్వామ్య వ్యతిరేక పోకడలకు కూడా అడ్డు కట్ట వేసింది. వార్తలలో నాణ్యత కాపాడింది. అంతర్జాలం ఈ చెలియలి కట్టను నిర్ములించివేసింది. దానితో ఏది నిజమో ఏది కల్పితమో తెలియకుండాపోయింది."
-- జాషువు టక్కర్ (https://www.nytimes.com/2021/02/17/opinion/digital-revolution-democracy-fake-news.html)
Comments
Post a Comment