పచ్చికబయలు
ఫిబ్రవరి 23, 2021
పచ్చికబయలు (pacchika-bayalu)
అర్థము
(విశేష్యము): సహజముగా గడ్డి పెరుగు ప్రాంతము, గడ్డి మైదానము, హరిత ప్రాంతం
Meaning
(noun) : meadow, grassland
వాడుక / Usage
వన్యప్రాణుల రక్షిత ప్రాంతమైన రోళ్లపాడు పచ్చికబయలులో పక్షుల సంఖ్య నానాటికి తగ్గిపోతోంది.
The bird population is declining in the grasslands of Rollapadu wildlife sanctuary.
మెదడుకు మేత / Food for thought
"ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో
ఆ వసంత మాసపు కులగోత్రాలను ఎల కోయిల అడిగేనాఎవరి పిలుపుతో పులకరించి పురి విప్పి తనువు ఊగేనో
ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెదుకులాడేనా....
ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా
గానం పుట్టుక గాత్రం చూడాలా
ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా
గానం పుట్టుక గాత్రం చూడాలా
వెదురును మురళిగ మలచి ఈ వెదురును మురళిగ మలచి
నాలో జీవన నాదం పలికిన నీవే
నా ప్రాణ స్పందన
నీకే నా హృదయ నివేదన"
-- కళాతపస్వి చిలికించిన సిరివెన్నెల, సీతారాముడు బాలు గళంలో కురిపించిన అమృతధారలు
Comments
Post a Comment