కనుమ
ఫిబ్రవరి 26, 2021
కనుమ (kanuma)
అర్థము
(విశేష్యము): కొండల మధ్య త్రోవ; కొండల వరుస; సందు; సంక్రాంతి మూడో రోజు
Meaning
(noun) : narrow opening between hills; hill range; third day of Sankranthi
వాడుక / Usage
తిరుమల కొండలు తూర్పు కనుమల్లో శేషాచలం - వెలికొండ శ్రేణిలో ఉన్నాయి.
Tirumala hills are part of the Seshachalam-Velikonda range in Eastern Ghats.
మెదడుకు మేత / Food for thought
"సినిమా తెర అనే కాన్వాస్ మీద భారతీయత అనే కుంచెలో ముంచి దానికి సంగీతం సాహిత్యం అనే బ్రష్ తో కనక పెయింటింగ్ వేస్తే అది కే విశ్వనాథ్. ఆయన్ని సింబలైజ్ చేయాలంటే ఒక సాయంకాలం నీరెండ, ఒక సంక్రాంతి గొబ్బెమ్మ, ఒక ఆడపిల్ల జడలో మొగలి పువ్వు, గోధూళి వేళ ఇంటికి పరిగెత్తుకొచ్చే లేగ దూడ మేడలో గంట సౌండు, వర్షం వచ్చే ముందు మట్టిలోంచి వచ్చే వాసన, అమ్మ వేసవికాలంలో మండువాలో మనకి మట్టిగిన్నెలో కలిపి పెట్టే గోంగూర అన్నం, మన అహం పక్కన పెట్టి ఆత్మతో గడిపే సందర్భంలో గుర్తుకు వచ్చే విషయాల్లో అయన సినిమాలు ఉంటాయి. ఆయన తపస్వి కాదు, మనతో ఉండే రాజయోగి."
-- త్రివిక్రమ్ శ్రీనివాస్
Comments
Post a Comment