అవటు గ్రంధి

 

మార్చి 10, 2021

అవటు గ్రంధి (avatu grandhi)

    అర్థము

   (విశేష్యము):  మెడ మధ్యభాగంలో గొంతు ముందుండే డాలు ఆకారంలోని అవయవం. శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

   Meaning

     (noun) : thyroid gland

     వాడుక / Usage

  శరీరంలోని వినాళ గ్రంధులలో అతి పెద్దది అవటు గ్రంధి.
  Thyroid gland is the largest of the ductless glands in the body.

    మెదడుకు మేత / Food for thought

"జగన్నాథా! చితిమంటల ఆధారమే ఈ కాషాయంలో
కట్టెలవలే తేలెనే బ్రతుకు కోరికల సుడిగుండంలో
జీవితానికి నిశ్వాస, స్ఫురించునే అగ్నికీలల పావకంలో
అరిషడ్వార్గాలు భస్మీపటలం చేయుమా ఈ హవనంలో

స్వార్ధానికి అతీతమైన స్వచ్ఛమైన ప్రార్థన విశాల గగనాన్ని తాకదా
చేసిన ధర్మము చెడని పదార్ధమై మన వెంట చేరదా
ధర్మదేవతలో ఐక్యమయ్యే ముహూర్తంలో దాత్రుగుణమే మన ఆప్త బంధువు కాదా!"

-- 'యుధిష్ఠిర అండ్ ద్రౌపది' , పవన్ వర్మ ఆంగ్ల పద్యం యొక్క స్వేఛ్ఛానువాదం

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి