మజ్జాముఖం

 

మార్చి 11, 2021

మజ్జాముఖం (majja mukham)

    అర్థము

   (విశేష్యము):  మెదడు చివరి భాగం. మెదడును, వెన్నుపామును కలిపే వారధి. అనియంత్రిత కండరాలకు సమాచారాన్ని అందిస్తుంది.

   Meaning

     (noun) : Medulla Oblongata

     వాడుక / Usage

  మజ్జాముఖంకి తీవ్ర గాయమైతే శ్వాస ప్రక్రియకి అంతరాయం ఏర్పడుతుంది.
  Serious injuries to medulla oblongata impedes breathing.

    మెదడుకు మేత / Food for thought

"ఏ నింద వచ్చినా స్త్రీకదా మొదట భరించవలిసింది? ఆమె తన బాధ చెప్పుకున్నా తప్పు ఆమెదే అంటారు కదా! పురుషుడు దౌర్జన్యం చేసినా పవిత్రుడే; పతిత అయ్యేది ఆమే కదా? సృష్టి తన ముద్రను అమె ఉదరం మీదనేకదా లిఖించేది! పురుషుడికన్నా జిత్తులలో టక్కరన్నా కావాలి. అతనికి స్థలమివ్వని పాషాణమన్నా చేసుకోవాలి హృదయాన్ని. ఎక్కడా బయటపడని మోసగత్తె, అబద్దీకురాలన్నా కావాలి లోకంలో కీర్తి పొందాలంటే! దయ, రసన, న్యాయము, సత్యము, - యీ సుగుణాలే స్త్రీని అధోగతికి లాగే గుణాలు, ఇటువంటి అధోగతికి తెచ్చింది స్త్రీని యీ పాతివ్రత్యాదర్శము, ఈ పవిత్ర నిబంధనలు."

-- బ్రాహ్మణీకం, చలం (మే 18, 1894 - 1979)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి