మండువా

  

మార్చి 22, 2021

మండువా (manḍuvā)

    అర్థము

   (విశేష్యము):  ఒక ఇంటి మధ్యన వాన నీరు పడటానికి, వెలుగు రావడానికి ఉంచిన ఖాళీ భాగము; నాలుగు స్తంభాల మీద కట్టిన పందిరి; ఒక వైపు గోడలేని (గుర్రాల) పాక

   Meaning

   (noun) : courtyard; a shed or hut open on one side; stable for horses

     వాడుక / Usage

  సహజమైన గాలి వెలుతురుతో మండువా ఇల్లు పర్యావరణ పరిరక్షణకి తోడ్పడతాయి. 
  Houses with open courtyards incorporate natural light and air, protecting environment.

    మెదడుకు మేత / Food for thought

"
"దారెరుగని వాడును గో
 దారిన తానొక్కమారు తడవని వాడును
 కూరిమిన ఆవకాయను
 ఆరారగ తిననివాడు ఆంధ్రుడు కాడోయి"

(గోదావరి నదిలో ఒక్కసారికూడా తడవనివాడు, ఆవకాయ రుచిచూడనివాడు ఆంధ్రుడు కాదు)

-- అజ్ఞాత కవి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి