వాకిలి
మార్చి 25, 2021
వాకిలి (vakili)
అర్థము
(విశేష్యము): గృహ ద్వారము; ఇంటి ముఖ ద్వారము; గుమ్మము; తలుపు
Meaning
(noun) : main door; door-way
వాడుక / Usage
సుప్రభాత వేళ అర్చకులు కుంచెకోలతో శ్రీవారి బంగారు వాకిలి తెరుస్తారు.
Priests open the golden doors of Tirumala temple with a special key.
మెదడుకు మేత / Food for thought
"
"మిసిమిగల పుల్లపెరుగుతో మిళితములుగ
ఆవపచ్చళ్లు చవిచూచి రాదరమునజుఱ్ఱుమని మూర్దములదాకి యెఱ్ఱదనము
పొగలు వెడలంగ నాసికాపుటములందు"
(బంగారు రంగులోని పుల్లటి పెరుగులో ఆవపిండి, మిరియాల ఘాటు కలిసిన పచ్చడి జుర్రుకుని తింటే ఆ మంట నషాళానికి తాకి, ముక్కులోంచి పొగలు వచ్చాయట)
-- శృంగార నైషధం, శ్రీనాధ కవి సార్వభౌమ (1365 - 1441)
Comments
Post a Comment