చూరు

 

మార్చి 26, 2021

చూరు (churu)

    అర్థము

   (విశేష్యము):  ఇంటి కప్పు చివర; పొడి; పొగ కర్ర

   Meaning

   (noun) : cornice, border, ledge, eaves of a roof; powder; charred wood

     వాడుక / Usage

  చూరు కింద కిలకిలమంటూ సందడి చేసే పిచుకలు ఈనాడు కనుమరుగైపోతున్నాయి.
  Sparrows chirping under roof ledges has become a rare sight.

    మెదడుకు మేత / Food for thought

"
"పెందలాడే కాస్త పప్పూ అన్నం బెడుదూ. చుట్టాలొచ్చారని, నవకాయ పిండివంటలు జేసేవ్‌. వంకాయ నాలుగు పచ్చళ్లు చేసి పోపులో వేసి, ఆనపకాయ మీద యింత నువ్వుపప్పు చల్లి, అరటిదూట మొఖాన ఇంత పెట్టి, తోటకూర కాడల్లో యింత పిండిబెల్లం పారేయ్‌. కొబ్బరీ, మామిడి, అల్లం యీ పచ్చళ్లు చాల్లే... పెరుగులో తిరగమోత పెట్టి దాన్లో పది గారెముక్కలు పడేయ్‌. రవంత శెనగపిండి కలిపి మిరపకాయలు ముంచి చమురులో వెయ్‌. సరే క్షీరాన్నమంటావా? అదో వంటా? ములక్కాయలు మరి కాసిని వేసి పులుసో పొయ్య మీద పడేయ్‌. ఈ పూటకు ఇల్లా లఘువుగా పోనీయ్‌. ఇదిగో నేను స్నానం చేసి వస్తున్నాగాని, ఈ లోగా, ఓ అరతవ్వెడు గోధుంపిండి తడిప్పెట్టూ, రత్తమ్మొస్తే నాలుగు వత్తి అలా పడేస్తుంది. మధ్యాహ్నం పంటి కిందకు వుంటాయ్‌..."



-- కృష్ణా తీరం, మల్లాది రామకృష్ణశాస్త్రి (జూన్ 16, 1905 - 1965)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి