గునపం
ఏప్రిల్ 7, 2021
గునపం (gunapamu)
అర్థము
(విశేషణము): మట్టి తవ్వే పొడుగాటి ఇనుప ఉపకరణం; గడ్డ పార; పలుగు
Meaning
(noun) : iron crow bar
వాడుక / Usage
నేటికీ మహాద్వారం చెంత అనంతాళ్వారు స్వామివారిపై విసిరిన గునపం భక్తులు చూడవచ్చు.
The crow bar thrown by Ananthalvaar at Venkateswara can be seen at the entrance.
మెదడుకు మేత / Food for thought
"
"పడమటి ఉరికంబం పై వేలాడిన వెలుతురు
నీవు నిద్రలేవక ముందేతూర్పు కొండలపై కూనిరాగం తీస్తుంది
గతం గుర్తులు గగనానికే వదిలేసి
తన గమ్యాన్ని వెతుక్కుంటూ
వెలుతురులు విరజిమ్ముతూ
వేగంగా వడివడిగా రానే వచ్చింది
రాత్రికి మళ్ళీ పోతుంది
మరణం… జననం
మళ్ళీ మరణం… మళ్ళీ జననం
నీవే జననం నీవే మరణం"
-- హనుమంత రావు చుండూరు, కవి, పాత్రికేయడు
Comments
Post a Comment