శ్రేణి
జులై 15, 2021
శ్రేణి (ṣrēṇi)
అర్థము
(విశేష్యము): వరుస; క్రమము; సమూహము; ఒక పద్ధతిలో ఉన్న అంకెల వరుస; బొక్కెన
Meaning
(noun) : a row/range; series; progression; group/guild; bucket
వాడుక / Usage
లీబ్నిజ్ కన్నా మూడు శతాబ్దాల పూర్వం కేరళకు చెందిన మాధవుడు త్రికోణమితి అనంత శ్రేణిలు కనుగొన్నాడు.
Three centuries before Leibnitz Kerala's Madhava discovered the trigonometric infinite series. మెదడుకు మేత / Food for thought
"రతికేళిలో హారము తెగిపోగా ముత్యాలు అయ్యాయి చెల్లాచెదురు. వాటిలో ఆరో వంతు నేల మీద దొర్లాయి, అయిదో వంతు పడక మంచంలో పొర్లాయి. జాణ చేతిలో మూడో భాగం, ప్రియుడి చేతిలో పదో వంతు. హారంలో ఆరు ముత్యాలు మిగిలితే, మొత్తం ముత్యాలు ఎన్నో చెప్పుకోగలరా? "
-- లీలావతీ గణితంలో సమస్య, భాస్కరాచార్య (1114 - 1185)
Comments
Post a Comment