పుప్పొడి

 

జులై 20, 2021

పుప్పొడి (puppoḍi)

    అర్థము

   (విశేష్యము): పుష్పములోని ధూళి; పరాగము; కౌసుమము; సుమనోరజము

   Meaning

   (noun) : pollen of a flower

     వాడుక / Usage
   
ఏడాకులపాల చెట్ల పుప్పొడి ఆరోగ్య సమస్యలకు కారణం అని స్థానికులు చెపుతున్నారు.
 Locals complain that the pollen from the Blackboard trees causes health issues.

    మెదడుకు మేత / Food for thought

"మంజూషలోనె యమర్చి కోణంబందు
నొక్కి త్రాటం గొప్పు నెక్కు వెట్టె
గాబోలు మంజూషికా వినిర్గమనంబు
వేళకే జ్యావల్లి బిగిసియుండె
దాళప్రమాణమౌ ధనువు జానకిదృష్టి
కడ్డమ్ముగా వచ్చునంచు నెంచె
గాబోలు నడ్డంబుగా ధనుస్సును బూని
పిడిబాకువలె ద్రాడు వ్రీలలాగె


నతని దృష్టికి జానకి యాగలేదు
అతని కృష్టికి శివధనుస్సాగ లేదు
సీత పూజడవెన్నుగా శిరసు వంచె
జెరుకుగడవోలె నడిమికి విరిగె ధనువు"


(పెట్టెలో ఉండగానే, అల్లెత్రాటిని కొప్పుకి కట్టాడేమో అన్నట్టుగా, ఆ విల్లుని పెట్టెలోంచి తీసేప్పటికే  ఆ త్రాడు బిగిసి ఉంది. తాడిచెట్టంత పొడుగున్న ఆ విల్లు, సీతని చూడ్డానికి అడ్డం వస్తుందని అనుకున్నాడో ఏమో, రాముడు దాన్ని అడ్డంగా పట్టుకొని, పిడిబాకుని లాగినంత సులువుగా అల్లెత్రాడుని లాగాడు. అతని చూపులని జానకి తట్టుకోలేకపోయింది. అతని బలాన్ని ఆ శివధనుస్సు తట్టుకోలేకపోయింది. సీత సిగ్గుతో పూలజడ కనిపించేంతగా తలదించుకుంది. ఆ శివధనుస్సు చెఱుకుగడలాగా  మధ్యకి విరిగిపోయింది)

-- రామాయణ కల్పవృక్షం, విశ్వనాథ సత్యనారాయణ (సెప్టెంబర్ 10, 1895 - 1976)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ