కాండము

 

జులై 22, 2021

కాండము (kānḍamu)

    అర్థము

   (విశేష్యము): చెట్టుబోదె, ఈనె, కాడ; నీళ్లు; బాణము; కావ్య/పుస్తక పరిచ్ఛేదము

   Meaning

   (noun) : tree trunk, stem, stalk; water; arrow; division/chapter in a book 

     వాడుక / Usage
   
   వినాయక చవితిలో పత్రిగా వాడే ఉత్తరేణి కాండం, ఆకులు అనేక వ్యాధులు నివారిస్తాయి.
   Used in Ganesh festival, Prickly chaff flower, stalk and leaves have many therapeutic uses.

    మెదడుకు మేత / Food for thought

"ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో..

భూగోళం పుట్టుక కోసం రాలిన సుర గోళాలెన్నో
ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నర కంఠములెన్నో
కుల మతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో..

మానవ కళ్యాణం కోసం పణమెత్తిన రక్తము ఎంతో
రణరక్కసి కరాళ నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో
కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో
భూస్వాముల  దౌర్జన్యాలకు
ధనవంతుల దుర్మార్గాలకు
దగ్ధమైన బతుకులు ఎన్నో...

అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం
కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో
పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో
గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో..."

-- ప్రశ్న గేయం, దాశరథి కృష్ణమాచార్య (జులై 22, 1925 - 1987)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ