కింజల్కము
జులై 23, 2021
కింజల్కము (kinjalkamu)
అర్థము
(విశేష్యము): పుష్పములలోని పురుషభాగము, పుప్పొడితిత్తిగల కాడ; కేసరము
Meaning
(noun) : stamen
వాడుక / Usage
పరాగసంపర్కాన్ని కింజల్కము నుండి కీలాగ్రము వరకు వెళ్ళే ప్రక్రియగా పిలుస్తారు.
Pollination is the process of transferring pollen from stamen to stigma.
మెదడుకు మేత / Food for thought
"
శిలయైన పతిం దెలచిన గాలులు
మెల మెల్లగ తన తరగల నూగగచలచల్లన ప్రాణమ్ములు తేరగ
తలచిన కొలంది దుఃఖము పొంగగ
హా యని
కిన్నెర యేడుపు చూచి పులుగులూ
కిన్నెర దుఃఖము చూచి మృగములూ
కిన్నెర యేడుపు చూచి గాలులూ
ఓదార్చగలే కవియు నేడ్చెనూ
హా యని
కిన్నెర దుఃఖము చూచి మృగములూ
కిన్నెర యేడుపు చూచి గాలులూ
ఓదార్చగలే కవియు నేడ్చెనూ
హా యని
గోదావరి యీవార్త విన్నదీ
గోదావరినది గుండె కరగినది
గోదావరినది జాలి పొందినది
గోదావరి కన్నీరు కార్చినది
హా యని
గోదావరినది గుండె కరగినది
గోదావరినది జాలి పొందినది
గోదావరి కన్నీరు కార్చినది
హా యని
గోదావరినది పొంగి వచ్చినది
గోదావరి తా నభయ మిచ్చినది
గోదావరి కెరటాలు చాచినది
గోదావరి రమ్మన్నది కిన్నెర
హా యాని
గోదావరి తా నభయ మిచ్చినది
గోదావరి కెరటాలు చాచినది
గోదావరి రమ్మన్నది కిన్నెర
హా యాని
"
-- కిన్నెరసాని పాటలు, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ (సెప్టెంబర్ 10, 1895 - 1976)
Comments
Post a Comment