కైంకర్యము
జులై 27, 2021
కైంకర్యము (kain-karyamu)
అర్థము
(విశేష్యము): భగవంతునికి భక్తులు చేసే సేవ; ఊడిగము; కింకర; దొంగతనం; మోసం
Meaning
(noun) : service in a temple; serve; steal; deceive
వాడుక / Usage
శ్రీవారి కైంకర్యానికి వినియోగించే గంధపు చెట్లు వెయ్య ఎకరాల్లో నాటారు.
Sandalwood trees used in the service of Sri Venkateshwara are being grown in 1000 acres.
మెదడుకు మేత / Food for thought
"కులాల కోసం గుంపులు కడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ
ఎక్కడలేని తెగువను చూపి తగువుకి లేస్తారే, జనాలు తలలర్పిస్తారేసమూహక్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకు పోతూ
మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే, తెలిసి భుజం కలిపి రారే
అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి? పోరి, ఏమిటి సాధించాలి?
ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సిందూరం
జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా! ఓ అనాథ భారతమా!"
-- సింధూరం, సీతారామ శాస్త్రి; అర్థ శతాబ్ధం అయ్యి పాతికేళ్ళు అయినా వ్యధ అదే నిట్టూర్పు అదే
Comments
Post a Comment