కౌటిల్యము
జులై 29, 2021
కౌటిల్యము (kauṭilyamu)
అర్థము
(విశేష్యము): కపటము; కుటిలము; వంకరతనము; టక్కు; మాయ; జిత్తు
Meaning
(noun) : crookedness; dishonest; fraudulent
వాడుక / Usage
అంతర్జాతీయ సంబంధాలలో మిత్ర దేశాలతో కూడా కొద్ది మేర కౌటిల్యము పరిపాటే.
In International relations even among friendly nations dishonesty is the norm.
మెదడుకు మేత / Food for thought
"నా దేశం కరుణాంతరంగ నా దేశం సంస్కారగంగ
ఎక్కడికెళుతోంది దేశం ఏమై పోతోంది?
హిమశైల శిఖరం పైకా...పాతాళ కుహరంలోకా..
ప్రవచనాల పచ్చిక బయళ్లలో పన్నాగాల గోతులు
ప్రణాళికల గాదెల కింద దాక్కున్న పందికొక్కులు
పావురాళ్ల ఈకలు తొడుక్కుని ఊరేగే రాబందులు
ఉగ్గు పాలతో మతమౌఢ్యాలని రంగరించి
కంచాలలో వర్ణభేదాలను వడ్డించి
జాతికి నల్లమందు ఎక్కించే మతోన్మాదులు.."
-- బంగారు మనిషి, డా.సి.నారాయణ రెడ్డి (జులై 29, 1931 - 2017)
Comments
Post a Comment