నిగారము
జులై 08, 2021
నిగారము (nigaaramu)
అర్థము
(విశేష్యము): శ్రేష్ఠము; తళుకు, బెళుకు; నిగ్గు; నిగనిగ (మెరవటం) అనుకరణ పదం
Meaning
(noun) : excellent; glittering; shining; bling (manner imitation word)
వాడుక / Usage
పనస పండు తినడం వల్ల చర్మ నిగారింపు పెరుగుతుందని చెప్తారు.
Jack fruit is said to make the skin glow. మెదడుకు మేత / Food for thought
"నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది
కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది
రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లింది
దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది
శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపిందిఆకురాలు అడవికి ఒక ఆమని దయ చేసింది
విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినబడి అంతలో పోయాయి
కొమ్మల్లో పక్షుల్లారా గగనంలో మబ్బుల్లారా
నది దోచుకుపోతున్న నావను ఆపండి
రేవు బావురుమంటోందని నావకు చెప్పండి
నావకు చెప్పండి..."
-- ముత్యాలముగ్గు, గుంటూరు శేషేంద్ర శర్మ (అక్టోబర్ 20, 1927 - 2007) సినిమాల కోసం వ్రాసిన ఏకైక గీతం
Comments
Post a Comment