మిటమిట

 

జులై 09, 2021

మిటమిట (miṭa-miṭa)

    అర్థము

   (విశేషణము): మండడానికి ధ్వన్యనుకరణం; మిక్కిలి వేడిగా, ప్రకాశముగా; కోపంతో చూడటం

   Meaning

   (adverb) : blazing hot, bright; seeing angrily

     వాడుక / Usage
   
కెనడాలో మిటమిటలాడే ఎండకి అలవాటులేని జనం మలమల మాడిపోయారు.
  Unused to the fierce heat Canada withered.

    మెదడుకు మేత / Food for thought

"పుట్టబోయెడి బుల్లిబుజ్జాయి కోసమై
పొదుగుగిన్నెకు పాలు పోసి పోసి
కలికి వెన్నెల లూరు చలువ దోసిళ్ళతో
లతలకు మాఱాకు లతికి యతికి
పూలకంచాలలో రోలంబములకు ఱే
పటి భోజనము సిద్దపఱచి
తెలవాఱకుండ మొగ్గలలోన జొరబడి
వింత వింతల రంగు వేసి వేసి
తీరికే లేని విశ్వ సంసారమందు
అలసిపోయితి వేము దేవాదిదేవ !
ఒక నిమేషమ్ము కన్ను మూయుదువుగాని
రమ్ము! తెఱచితి మా కుటీరమ్ము తలుపు ! "

-- ఉదయశ్రీ, జంధ్యాల పాపయ్య శాస్త్రి (ఆగష్టు 04, 1912 - 1992)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ