బిసబిస

 

ఆగష్టు 10, 2021

బిసబిస (bisa-bisa)

    అర్థము

   (విశేష్యము): వేగముగా; గాలి వీచడంలో, తొందరగా నడవడంలో అయ్యే ధ్వని నుంచి

   Meaning

   (adverb) : quickly; rapidly

     వాడుక / Usage
   
   బిసబిసగా వచ్చిన తుఫాను గాలులు తీర వాసులను భయభ్రాంతులు చేసాయి.
   Cyclone winds blowing at high speeds terrified people on the coast.

    మెదడుకు మేత / Food for thought

యింతేనటే సంద్ర మెంతొయనుకొంటి
మనకూ సూరీడుకూ మద్దెనుందేనా!

నానీతి నాజాతి
నావారెపోనాడ
మరిగి నామనసు సా
గరమాయెనన్నారు ఇంతే...

నారాజె నాకాసి
వేరు సూపులు సూడ
కడలివలె నా గుండె
కలతబడె నన్నారు ఇంతే...

సత్తె మెరిగినపాప
పొత్తిళ్లలో దాగి
కన్నీరు మున్నీరు
కరిగిస్తి నన్నారు ఇంతే...

అంచుదరి లేదంటె
అమృత ముంటాదంటె
దేము డంతుంటాదొ
ఏమొ యనుకొన్నాను ఇంతే...

-- సంద్రం, ఎంకి పాటలు, నండూరి వెంకట సుబ్బారావు (1884 - 1957)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి