కీలు
ఆగష్టు 11, 2021
కీలు (kīlu)
అర్థము
(విశేష్యము): మఱ; సులభంగా వంగటానికి ఏర్పరిచిన మఱ; మర్మము; ఉపాయము; తారు
Meaning
(noun) : hinge; joint; tar; solution; idea
వాడుక / Usage
కోరికలనే గుర్రాలను అదుపులో పెట్టే కీలు మనకవసరం.
Finding the key to controlling our desires is paramount to us.
మెదడుకు మేత / Food for thought
దేవి...!!
రాణివాసంబు భోగంబులు అనుభవింపవలసిన నిన్ను
ఈ ఘోరారణ్యమున కీడ్చితెచ్చి
కుసుమ సుకుమారమైన నీ శరీరమును
ఇలాంటి వ్యర్థయాత్రలచే నలగింప చేసిన నన్ను
నేనేమని నిందించుకుందును ప్రేయసి
ఏనాడు....!!! నడచినావు
ఈ ఎడారులలోన...!!
సలలిత...సలలిత
ఆరామ సీమలనేగానీ..!!
ఏనాడు....ఏనాడు....!!
తలచూపితివి ప్రచండపుటెండకు
అలఘుమాణిక్య కాంతులకే గానీ...!!
ఏనాడు చవిచూచితివి కందమూలముల్
సరసరాజాన్న భోజనమే కానీ...
ఏనాడు...!!!
చవిజేర్చితివి క్రూరమృగాదుల్
లీలా సుఖాలాప పాలిగానీ....
కటకటా...కటకటా....అకటా...
యెన్నడెరిగితి ఉత్కరదినేశ
కరకిరణ జాల తత్ప కర్కశశిలాద్రి
కటకగమన శ్రమోద్భూత చటులచింత...!!
ననువరించుటజేసి దేవీ...ననువరించుట జేసి...ననువరించుట జేసి...
ఈనాడే కానీ...!
ఏనాడు నడచినావు
ఈ ఎడారులలోన....!!
-- అడవిలో భార్య కష్టాలు చూసి సత్య హరిశ్చంద్రడు, బలిజేపల్లి లక్ష్మీకాంతం (డిసెంబర్ 23, 1881 - 1953)
Comments
Post a Comment