శోధనము
ఆగష్టు 12, 2021
శోధనము (ṣō-dhanamu)
అర్థము
(విశేష్యము): వెతుకుట; పరిష్కరించుట; శుభ్రం చేయుట; వాపు
Meaning
(noun) : search; inquire; find a solution; purify; swelling
వాడుక / Usage
జీవాన్వేషణ కోసం అంగారకుడిపై నాసా రోవర్ శోధన.
NASA's rover searches for life on Mars.
మెదడుకు మేత / Food for thought
ఎడారిలో కోయిలా
తెల్లారనీ రేయిలా
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా
పూదారులన్నీ గోదారి కాగా
పూదారులన్నీ గోదారి కాగా పాడింది కన్నీటిపాట
ఎడారిలో కోయిల తెల్లారనీ రేయిలా
తెల్లారనీ రేయిలా
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా
పూదారులన్నీ గోదారి కాగా
పూదారులన్నీ గోదారి కాగా పాడింది కన్నీటిపాట
ఎడారిలో కోయిల తెల్లారనీ రేయిలా
పల్లవించు ప్రతిపాట బ్రతుకు వంటిదే
రాగమొకటి లేక తెగిన వీణ వంటిదే
రాగమొకటి లేక తెగిన వీణ వంటిదే
ఎద వీణపై అనురాగమై తలవాల్చి నిదురించు నా దేవత
కల అయితే శిల అయితే మిగిలింది ఈ గుండె కోత
నా కోసమే విరబూసిన మనసున్న మనసైన మరుమల్లిక
ఆమనులే వేసవులై రగిలింది ఈ రాలు పూత
రగిలింది ఈ రాలు పూత విధిరాత చేత నా స్వర్ణ సీత
ఎడారిలో కోయిల తెల్లారనీ రేయిలా
కల అయితే శిల అయితే మిగిలింది ఈ గుండె కోత
నా కోసమే విరబూసిన మనసున్న మనసైన మరుమల్లిక
ఆమనులే వేసవులై రగిలింది ఈ రాలు పూత
రగిలింది ఈ రాలు పూత విధిరాత చేత నా స్వర్ణ సీత
ఎడారిలో కోయిల తెల్లారనీ రేయిలా
కొన్ని పాటలింతే గుండెకోతలోనే చిగురిస్తాయి
కొన్ని బ్రతుకులంతే వెన్నెలతో చితి రగిలిస్తాయి
కొన్ని బ్రతుకులంతే వెన్నెలతో చితి రగిలిస్తాయి
ఆ రూపమే నా దీపమై వెలిగింది మూణ్ణాళ్లు నూరేళ్లుగా
వేదనలో వెన్నెలగా వెలిగించి తన కంటిపాప
చలిమంటలే చితిమంటలై చెలరేగె చెలిలేని నా కౌగిట
బ్రతుకంటే మృతి కంటే చేదైన ఒక తీపి పాట
చేదైన ఒక తీపి పాట చెలిలేని పాట ఒక చేదు పాట
వేదనలో వెన్నెలగా వెలిగించి తన కంటిపాప
చలిమంటలే చితిమంటలై చెలరేగె చెలిలేని నా కౌగిట
బ్రతుకంటే మృతి కంటే చేదైన ఒక తీపి పాట
చేదైన ఒక తీపి పాట చెలిలేని పాట ఒక చేదు పాట
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా
పూదారులన్నీ గోదారి కాగా
పూదారులన్నీ గోదారి కాగా పాడింది కన్నీటిపాట
ఎడారిలో కోయిల తెల్లారనీ రేయిలా
పూదారులన్నీ గోదారి కాగా
పూదారులన్నీ గోదారి కాగా పాడింది కన్నీటిపాట
ఎడారిలో కోయిల తెల్లారనీ రేయిలా
-- పంతులమ్మ, వేటూరి (జనవరి 29, 1936 - 2010)
Comments
Post a Comment