జాలము
ఆగష్టు 13, 2021
జాలము (jālamu)
అర్థము
(విశేష్యము): వల; కిటికీ; కపటము; మాయ; మొగ్గ; సమూహము
Meaning
(noun) : net; window; deceit; illusion; a bud; an assembly or collection
వాడుక / Usage
మనిషి యొక్క అభివృద్ధి జంతుజాలం మీద అనుద్దిష్ట ప్రభావం చూపింది.
Humanity's development has had unintended consequences on the animal kingdom.
మెదడుకు మేత / Food for thought
భక్తి నిలిపి పరమాత్ముని చేరే భావము గనవలెరా
విరక్తి పురుషుడై పగతులనందరి పట్టి అణచవలెరా
బిసబిస తిరిగే వాయువు నిలిపే కీలు తెలియవలెరా
వాయువు తిరిగే మార్గములన్నియు బంధించగవలెరా
మూడు అండములు మృదువుగా ఉన్నవి మూలమెరుగవలెరా
అండములో బ్రహ్మాండముల సుషుమ్నామ్గము గనవలెరా
శాస్త్ర శోధకలు ఎన్ని నేర్చినా మార్గము తెలియదురా
దేహ శోధకము సాధకమెరిగిన యోధకు తెలుసునురా
ఇహచా(జా)లంబులు ఆంటీ అంటక యుక్తినుండవలెరా
మాయా మయమగు మాయనుతొలిచే మర్మము కనవలెరా
నిద్ర సమాధిలో మరువక తెలివిగా నిద్ర సేయవలెరా
సంతసముగా శ్రీసద్గురు ఉన్నది ఉనికి తెలియవలెరా
ఎప్పుడు శ్రీహరి ధ్యానము మరవక ముక్తుడు కావలెరా
అమర నరేయణ ఆదిగురునిలో ఐక్యము గావలెరా
-- కైవారం అమర నరేయణ (1762 - 1837)
Comments
Post a Comment