ముక్తసరి
ఆగష్టు 16, 2021
ముక్తసరి (mukthasari)
అర్థము
(విశేషణము): క్లుప్తం; టూకీ; సంగ్రహం; సంక్షిప్తంగా (అరబీ భాష నుండి)
Meaning
(adjective) : concise; brief; abridged
వాడుక / Usage
ప్రధాన మంత్రి ముక్తసరిగా అయినా మీడియాతో రెండు ముక్కలు మాట్లాడరు.
The PM doesn't speak to the media even briefly.
మెదడుకు మేత / Food for thought
జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రీ దివ్యధాత్రి
జయ జయ జయ శత సహస్ర
నరనారీ హృదయనేత్రి
జనయిత్రీ దివ్యధాత్రి
జయ జయ జయ శత సహస్ర
నరనారీ హృదయనేత్రి
జయ జయ సశ్యామల
సుశ్యామచలచ్ఛేలాంచల
జయ వసంత కుసుమ లతా
చలిత లలిత చూర్ణకుంతల
జయ మదీయ హృదయాశయ
లాక్షారుణ పద యుగళ
జయ దిశాంత గత శకుంత
దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక
గళ విశాల పద విహరణ
జయ మదీయ మధుర గేయ
చుంబిత సుందర చరణ
-- భావ కవి దేవులపల్లి కృష్ణ శాస్త్రి (నవంబర్ 1, 1897 - 1980)
Comments
Post a Comment