మంకు
ఆగష్టు 17, 2021
మంకు (manku)
అర్థము
(విశేషణము): మొండి; మూర్ఖుడు; పెంకితనం; పట్టుదల; ఎంత చెప్పినా విననివారు
Meaning
(adjective) : stubborn; stupid; fool
వాడుక / Usage
ముఖ్య మంత్రి మంకుగా తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రానికి గుదిబండ అయ్యాయి.
The stubborn decisions of the CM have become a millstone around the states neck.
మెదడుకు మేత / Food for thought
కూరిమి గల దినములలో
నేరము లెన్నడును గలుగ నేరవు మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచు చుండు నిక్కము సుమతీ
నేరము లెన్నడును గలుగ నేరవు మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచు చుండు నిక్కము సుమతీ
(పరస్పరము స్నేహం ఉన్న రోజులలో ఎన్ని తప్పులు జరిగినా అస్సలు కనిపించవు. అదే స్నేహం చెడగానే అన్ని తప్పులుగానే కనిపిస్తాయి. ఇది సత్యము.)
-- సుమతీ శతకం
Comments
Post a Comment