ఉపోద్ఘాతము

 

ఆగష్టు 18, 2021

ఉపోద్ఘాతము (upōdghātamu)

    అర్థము

   (విశేష్యము): ఉదాహరణము; పీఠిక; అవతారిక; పుస్తకం యొక్క ఆరంభము

   Meaning

   (noun) : preface; introduction to a book or speech

     వాడుక / Usage
  ఉపోద్ఘాతము లేకుండా రెండు గంటలసేపు మంత్రి సుత్తి కొట్టాడు.
  The minister started without prefacing his speech and bored the audience for two hours.

    మెదడుకు మేత / Food for thought

సడి సేయకో గాలి.. సడి సేయబోకే
సడి సేయకో గాలి.. సడి సేయబోకే
బడలి ఒడిలో రాజు పవళించేనే


సడి సేయకే..

రత్నపీఠిక లేని రారాజు నా స్వామి
మణికిరీటము లేని మహరాజుగాకేమి
చిలిపి పరుగులు మాని కొలిచి పోరాదె

సడి సేయకే..

ఏటి గలగలలకే ఎగసి లేచేనే
ఆకు కదలికలకే అదరి జూసేనే
నిదుర చెదరిందంటే నేనూరుకోనే

సడి సేయకే..

పండువెన్నెల నడిగి పాన్పు తేరాదే
ఈడ మబ్బుల దాగు నిదుర తేరాదే
విరుల వీవెన పూని విసిరిపోరాదే

సడి సేయకో గాలి.. సడి సేయబోకే
బడలి ఒడిలో రాజు పవళించేనే
సడి సేయకో గాలి..

-- రాజమకుటం(1960), దేవులపల్లి కృష్ణ శాస్త్రి (నవంబర్ 1, 1897 - 1980)

Comments

  1. thank you so much for creating and maintaining this blog !!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి