ప్రౌఢిమ

 

ఆగష్టు 19, 2021

ప్రౌఢిమ (prauḍhima)

    అర్థము

   (విశేష్యము): నేర్పు; సామర్థ్యం; ప్రావీణ్యం; ప్రగల్భత 

   Meaning

   (noun) : skill; ability; grandeur

     వాడుక / Usage
  శ్రీ కృష్ణ దేవరాయలు తన శౌర్య ప్రౌఢిమతో శాంతి నెలకొల్పి సకల కళలను పోషించాడు.
  Krishna Deva Raya's  skilled valour established peace and nurtured arts.

    మెదడుకు మేత / Food for thought

తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం
తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం
గగనాల దాక అల సాగకుంటె మేఘాలరాగం ఇల చేరుకోదా
వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా
వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా
ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా
ప్రతి మదిని లేపే ప్రభాత రాగం
పదే పదే చూపే ప్రధాన మార్గం
ఏవీ సొంతం కోసం కాదను సందేశం
పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం
ఇది తెలియని మనుగడ కధ దిశలెరుగని గమనము కద
బ్రతుకున లేని శృతి కలదా ఎద సడిలోనే లయ లేదా
బ్రతుకున లేని శృతి కలదా ఎద సడిలోనే లయ లేదా
ఏ కళకైనా ఏ కలకైనా జీవితరంగం వేదిక కాదా
ప్రజాధనం కాని కళా విలాసం ఏ ప్రయోజనం లేని వృధా వికాసం
కూసే కోయిల పోతే కాలం ఆగిందా
మారే ఏరే పారే మరో పదం రాదా
మురళికిగల స్వరమున కళ పెదవిని విడి పలకదుకద

-- రుద్రవీణ (1988), సిరివెన్నెల సీతారామ శాస్త్రి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి